: 'జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది' పాట చక్రికి వర్తిస్తుంది: శ్రీలేఖ


ఎంతో మంచి మనిషైన చక్రి... ఇక లేడనే వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని సంగీత దర్శకురాలు, గాయని శ్రీలేఖ అన్నారు. చక్రి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడానని చెప్పారు. ఇటీవల జరిగిన 'మేము సైతం' కార్యక్రమంలో చక్రితో చివరిసారిగా మాట్లాడానని... అప్పుడు ఆయన కొంచెం డల్ గా ఉన్నట్టు అనిపించిందని తెలిపారు. చక్రి మన మధ్య లేకపోయినా, ఆయన అందించిన పాటల్లో బతికే ఉన్నారని చెప్పారు. 'జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది' అనే పాటను ఆయన ఎందుకు కంపోజ్ చేశారో తెలియదు కానీ... అది సరిగ్గా ఆయనకే వర్తిస్తుందనుకుంటున్నానని శ్రీలేఖ అన్నారు. చక్రికి మేమంతా ఉన్నామని... మా అందరి హృదయాల్లో ఆయన ఉంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News