: చక్రి మృతి పట్ల చిరంజీవి, హరికృష్ణ సంతాపం
ప్రముఖ సినీ దర్శకుడు చక్రి మృతి పట్ల కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, టీడీపీ నేత నందమూరి హరికృష్ణలు తమ సంతాపాన్ని తెలియజేశారు. చక్రి మరణ వార్తను నమ్మలేకపోయానని చిరంజీవి అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న చక్రి ఆకస్మిక మరణం పాలవడం బాధిస్తోందని చెప్పారు. చక్రి కుటుంబసభ్యులకు చిరంజీవి, హరికృష్ణలు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.