: అత్యవసరంగా ల్యాండ్ అయిన హైదరాబాద్-సింగపూర్ విమానం
హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన గంట తర్వాత ఎంఐ473 విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో విమానాన్ని హైదరాబాదులో అత్యవసరంగా దించివేశారు. ప్రయాణికులను సమీపంలోని నొవాటెల్ హోటల్ కు తరలించారు.