: సిడ్నీలో 20 మందిని నిర్బంధించిన ఆగంతుకులు... ఇస్లామిక్ జెండా ప్రదర్శన
ఆస్ట్రేలియాలోని సెంట్రల్ సిడ్నీ ప్రాంతంలోని ఓ కేఫ్ లో ఆగంతుకులు 20 మందిని బంధించారు. కేఫ్ లోని ఓ కిటికీ గుండా ఇస్లామిక్ జెండాను ప్రదర్శిస్తున్నారు. నల్ల రంగులో ఉన్న ఆ జెండాపై తెలుపు రంగులో అరబిక్ భాషలో ఏదో రాసి ఉంది. అప్రమత్తమైన పోలీసులు కేఫ్ ను చుట్టుముట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా, పరిసర ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. ఆయుధాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు కేఫ్ లో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కిటికీ గుండా లోపల ఏం జరుగుతోందో గమనించిన పోలీసులు షాక్ కు గురయ్యారు. బంధీలుగా ఉన్న వారంతా చేతులు పైకెత్తి, తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. ఈ ఘటనతో ఆస్ట్రేలియాలో హైఅలర్ట్ ప్రకటించారు.