: రానున్న 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు
రానున్న 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. నిన్న కూడా ఇరు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.