: శ్రీకాంత్ జట్టు ఘనవిజయం... సెలబ్రేట్ చేసుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు
విజయవాడలో జరిగిన టాలీవుడ్ ఫండ్ రైజింగ్ మ్యాచ్ లో శ్రీకాంత్ ఎలెవన్ ఘనవిజయం నమోదు చేసింది. తరుణ్ ఎలెవన్ ను 39 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత శ్రీకాంత్ జట్టు 19.2 ఓవర్లలో 199 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో తరుణ్ జట్టు సరిగ్గా 20 ఓవర్లు ఆడి 160 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు ఉత్సాహంతో నర్తించి క్రీడాస్ఫూర్తిని చాటారు. శ్రీకాంత్ జట్టు విజయాన్ని తరుణ్ ఎలెవన్ ఆటగాళ్లు కూడా సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం ఈ మ్యాచ్ నిర్వహించడం తెలిసిందే.