: పీజే శర్మ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం


టాలీవుడ్ సీనియర్ నటుడు పీజే శర్మ (70) మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కూడా సంతాపం తెలియజేశారు. శర్మ ఈ ఉదయం 7.30 గంటలకు తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. పీజే శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వర శర్మ. ఆయనకు ముగ్గురు కుమారులు. సాయికుమార్, రవిశంకర్, అయ్యప్ప శర్మ... ముగ్గురూ సినీ పరిశ్రమలో తమదైన శైలిలో రాణిస్తున్నారు. కాగా, పీజే శర్మ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాదు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో జరుగుతాయి.

  • Loading...

More Telugu News