: హౌరా వద్ద పట్టాలు తప్పిన పూర్వ ఎక్స్ ప్రెస్
కోల్ కతా నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న పూర్వ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12303) నేటి ఉదయం హౌరా వద్ద పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. అయితే, రైలు చాలా నిదానంగా వెళుతుండడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రైలు ప్రమాద ఘటనతో ఈ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.