: ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే కేసీఆర్ పథకాలు: రేవంత్ రెడ్డి ధ్వజం
ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్ల కోసమే వాటర్ గ్రిడ్ నిర్మాణం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడి చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆయన కట్టాలనుకొంటున్న వంద అంతస్తుల భవనాలు ఎవరి కోసం? ఎందుకు కట్టించాలనుకొంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు గ్రామాలలో దళితులు, బీద ప్రజలు తలదాచుకోవడానికి కనీసం గుడిసెలు కూడా లేక నానా అవస్థలు పడుతుంటే కేసీఆర్ వంద అంతస్తుల భవనాలు నిర్మించాలనుకోవడం హాస్యాస్పదమని ఆక్షేపించారు. బడాబాబుల కోసం, ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే కేసీఆర్ ఈ మెగా ప్రాజెక్టులు ఆరంభిస్తున్నట్లున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వాటర్ గ్రిడ్ పథకం కూడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చుతుందే తప్ప, దానివల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ కలగదని ఆయన అన్నారు.