: ఖమ్మం ఎంఎల్ఏ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు మాయం


ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్ కుమర్ బ్యాంకు ఖాతా నుంచి గుర్తు తెలియని దుండగులు డబ్బు కాజేశారు. ఆయన ఖాతా, పాస్ వర్డ్ వివరాలు తెలుసుకున్న దుండగులు ఆన్ లైన్ షాపింగ్ ద్వారా సుమారు రూ.1.30 లక్షల వరకు కాజేశారు. మూడు ధపాలుగా డబ్బు లాగారని తెలుస్తోంది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆన్ లైన్ లో షాపింగ్ చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాల నంబర్లు, పాస్ వర్డ్ వివరాలు బయట వారికి తెలియకుండా జాగ్రత్త పడకపోతే ఇంతే మరి!

  • Loading...

More Telugu News