: లండన్ 'ఓల్డ్ వార్ బిల్డింగ్' కొనుగోలు చేసిన హిందూజాలు
లండన్‌లో చారిత్రక సంపదగా నిలిచిన 'ఓల్డ్ వార్ ఆఫీస్ బిల్డింగ్'ను హిందూజా గ్రూప్ కొనుగోలు చేసింది. స్పెయిన్ కు చెందిన ఓహెచ్ఎల్ డీ సంస్థ తో కలసి సంయుక్తంగా హిందూజాలు ఈ భవనాన్ని కొన్నారు. సెంట్రల్ లండన్ లో బ్రిటిష్ పార్లమెంట్, ప్రధాని గృహాలకు అత్యంత సమీపంలో ఉన్న ఈ బిల్డింగులో మొత్తం 1,100 గదులు ఉనాయి. ఒక 5-స్టార్ హోటల్, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు ఉన్న భవంతిని 5.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అప్పటి ప్రధాని విన్ స్టన్ చర్చిల్ వినియోగించిన కార్యాలయం ఇదే కావడం గమనార్హం. అయితే, ఈ కొనుగోలుకు ఎంత వెచ్చించామన్న విషయాన్ని హిందుజా గ్రూప్ వెల్లడించలేదు.