: టాయిలెట్ కట్టివ్వకుంటే విడాకులే... ఓ గృహిణి అల్టిమేటం


ఒక నెల రోజుల్లోగా ఇంట్లో మరుగుదొడ్డి కట్టించకుంటే విడాకులు ఇవ్వాలని ఓ గృహిణి తన భర్తకు లీగల్ నోటీసులు పంపింది. మహారాష్ట్రలోని బీద్ జిల్లాకు చెందిన రైతు సంతోష్ భార్య వందన తీసుకున్న సాహస నిర్ణయమిది. "అవసరాలు తీర్చుకోవడం కోసం బహిరంగ ప్రదేశాలకు వెళ్ళాల్సివస్తోంది. నేను చాలా సిగ్గుపడుతున్నాను. గత రెండేళ్లుగా నా భర్తకు చెబుతున్నాను. ఇప్పుడు నా కుమార్తె సైతం మద్దతుగా నిలిచింది. అందుకే లీగల్ నోటీసులు పంపించాను" అని వందన చెప్పింది. వీరిద్దరికీ వివాహమై 17 సంవత్సరాలు అయింది.

  • Loading...

More Telugu News