: యుద్ధ విమానాలకు మహిళా పైలట్లు!


అతిత్వరలో భారత మహిళలు యుద్ధ విమానాలను నడపనున్నారు. భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) యుద్ధవిమానాల్లో త్వరలో మహిళలను పైలట్లుగా నియమించే అవకాశం ఉందని వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా చెప్పారు. గయలో ఆయన మాట్లాడుతూ, యుద్ధ విమానాలు మినహా, వైమానిక దళంలోని అన్ని విభాగాల్లో మహిళలు ఇప్పటికే పనిచేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో వారిని యుద్ధవిమానాల పైలట్లుగా నియమించే అవకాశం ఉందని అన్నారు. కాగా, గతంలో అరూప్ రహా మాట్లాడుతూ, యుద్ధవిమానాల పైలట్లుగా మహిళలకు తగిన శారీరక అర్హతలేదని, ప్రత్యేకించి గర్భిణీలుగా ఉన్నప్పుడు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వారు ఇబ్బంది పడతారని అన్నారు.

  • Loading...

More Telugu News