: ఆత్మహత్య చేసుకున్న గురజాడ అప్పారావు ముని మనవడు
'కన్యాశుల్కం' రచనతో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన మహాకవి గురజాడ అప్పారావు ముని మనుమడు, ఉద్యానవన శాఖలో అసిస్టెంట్ డెరైక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గురజాడ శ్రీనివాస్ (47) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనివాస్‌కు ఇటీవల రాజమండ్రి నుంచి కాకినాడ బదిలీ అయింది. అక్కడ కొత్త ఇల్లు తీసుకోగా, శ్రీనివాస్ భార్య లలిత పాలు పొంగించేందుకు శనివారం కాకినాడ వెళ్లారు. శ్రీనివాస్ మొబైల్‌కు అనేకసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కాకినాడ అధికారులు ఇంటికి వెళ్లి చూశారు. పడకగదిలో ఫ్యాన్ కు ఓ టవల్ తో ఉరేసుకున్న శ్రీనివాస్ ను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.