: రాచరిక హోదా వదులుకున్న థాయ్‌లాండ్ యువరాణి
ఆమె ఓ రాజ్యానికి యువరాణి. అయితేనేం, ఆమె బంధువులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె తన రాచరిక హోదాను వదులుకోవాల్సి వచ్చింది. థాయ్‌లాండ్ యువరాజు మహా వజీరలోంగ్ కోర్న్ భార్య శ్రీరసమి, తన బంధువులు అవినీతి కుంభకోణంలో అరెస్టవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని రాజు భూమిబోల్ అదుల్యదేజ్‌కు లిఖిత పూర్వకంగా తెలియచేశారు. ఆమె అభ్యర్థనకు అంగీకరించిన రాజు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అవినీతి కుంభకోణంలో అరెస్టయిన శ్రీరసమి కుటుంబసభ్యులందరి రాజరిక హోదాను తొలగించేయాల్సిందిగా యువరాజు మహా వజీరలోంగ్‌కోర్న్ అంతకుముందే ఆదేశాలు జారీచేశారు. యువరాజును శ్రీరసమి 2001లో వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడున్నాడు.