: శభాష్... సీఎంలు ఇద్దరూ అభివృద్ధిలో పోటీపడుతున్నారు: రవిశంకర్ ప్రసాద్
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అభివృద్ధిలో పోటీ పడుతూ, రాష్ట్రాల ఉన్నతి కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. రెండు రాష్ట్రాల్లో చెరో మూడు చోట్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విశాఖలో ఐటీఐఆర్, సీడాక్ ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు.