: కార్గిల్ లో ఎముకలు కొరికే చలి... -10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ఇక్కడ మైనస్ డిగ్రీలు నమోదవడం సాధారణమే అయినా... నిన్న రాత్రి -10.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లో అతి తక్కువగా -9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతే నమోదయింది. నిన్నటి -10.2 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాత రికార్డు బద్దలైంది.