: జైళ్లలో ఉండాల్సిన వారు నీతులు చెబుతున్నారు: అశోక్ గజపతిరాజు
వైకాపా అధినేత జగన్ పై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పరోక్ష విమర్శలు గుప్పించారు. జైళ్లలో ఉండాల్సిన వారు నీతులు చెబుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలన్నింటినీ తెలుగుదేశం పార్టీ నెరవేరుస్తోందని చెప్పారు. ఈ రోజు విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి, రోడ్లకు శంకుస్థాపన చేశారు.