: ట్విట్టర్ లో యువ కథానాయిక మిలియన్ మార్క్


బాలీవుడ్ యువ కథానాయిక శ్రద్ధా కపూర్ కు ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. 'ఏక్ విలన్', 'హైదర్' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమ్మడు, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలందుకుంది. మరోవైపు ఈ 'ఆషికి2' భామ మరింత ఎగ్జయిట్ అవుతోంది. తాజాగా తన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో మిలియన్ (10 లక్షలు) మార్క్ ను చేరుకుంది. దీనిపై శ్రద్ధా స్పందిస్తూ, "వన్ మిలియన్ మార్క్ తో మేల్కొన్నాను! నాపై చాలా ప్రేమ చూపించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బోలెడంత ప్రేమను పొందగలిగాను!" అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం శ్రద్ధా 'ఏబీసీడీ 2' చిత్రం షూటింగుతో బిజీగా ఉంది.

  • Loading...

More Telugu News