: నిరాశా నిస్పృహలు తొలగాలంటే బీజేపీకి ఓటేయండి: ప్రధాని మోదీ
రాష్ట్రంలో నెలకొన్న నిరాశా నిస్పృహలు తొలగాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతువాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నిరాశా నిస్పృహలను పారదోలడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఒమర్ అబ్దుల్లా పాలనపైనా మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి ఒమర్ సర్కారే కారణమని ఆయన ఆరోపించారు. సుస్థిర పాలన బీజేపీకే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.