: బెజవాడలో ఏపీ సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజయవాడ నగరంలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని బందరు కాల్వలను పరిశీలించిన ఆయన దురాక్రమణల తొలగింపు, కాల్వల సుందరీకరణ పనులకు సంబంధించి అధికారులను వివరాలడిగారు. భవిష్యత్తులో విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన చంద్రబాబు తన ఆకస్మిక తనిఖీలను విజయవాడ నుంచే ప్రారంభిస్తానని చెప్పారు. ఇందులో భాగంగానే నేటి ఉదయం ఆయన బందరు కాల్వతో పాటు పలు ప్రాంతాలను సందర్శించారు. చంద్రబాబు ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.