: 'లింగ' పైరసీ సీడీల కలకలం...గుంటూరు జిల్లాలో పోలీసుల దాడులు


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'లింగ' విడుదలైన కొద్ది గంటల్లోనే సదరు చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలు మార్కెట్లో ప్రత్యక్షమయ్యాయి. గుంటూరు జిల్లా వినుకొండ కేంద్రంగా సాగుతున్న పైరసీ సీడీల తయారీ, విక్రయాలపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి, సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లింగ చిత్రానికి సంబంధించిన 60 వేలకు పైగా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వాటితో పాటు పైరసీ సీడీల తయారీకి వినియోగిస్తున్న పలు కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సోదాల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఒక్క లింగ చిత్రమే కాక, ప్రతి సినిమాకి విడుదలైన మరుక్షణమే వినుకొండలో పైరసీ సీడీ తయారవుతోందట. ఒక్క గుంటూరు జిల్లాలోనే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి పైరసీ సీడీలు తరలివెళుతున్నాయట.

  • Loading...

More Telugu News