: చేతనైతే నన్ను అరెస్టు చేయండి: మమతా బెనర్జీ
శారదా చిట్స్ కుంభకోణంలో చేతనైతే తనను అరెస్టు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాలు విసిరారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. మదన్ మిత్రాను సీబీఐ అరెస్టు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆయన దీదీ మంత్రి వర్గంలో సభ్యుడుగా ఉన్నారు. అదీ కాక మమతా బెనర్జీకి నమ్మకస్తులైన వ్యక్తుల్లో మదన్ మిత్రా ఒకరు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేసినప్పటికీ దీదీ ఆమోదించలేదు.