: కడుపులోని బిడ్డ కోసం కఠిన నిర్ణయం తీసుకుని ప్రాణ త్యాగం చేసిన తల్లి!


సృష్టిలో అమ్మను మించిన పదం, అమ్మను మించినదేదీ లేదని నిరూపించిందో త్యాగమూర్తి. తన ప్రాణం పోతున్నా పర్లేదనుకున్న ఆ తల్లి తన కడుపులో ఉన్న నలుసును మాత్రం కాదనుకోలేకపోయింది. అమ్మ మాధుర్యాన్ని తెలిపే సంఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని ఓ టీవీ ఛానల్లో ప్రజెంటర్ గా పనిచేస్తున్న క్యూ యువాన్ (26) గర్భం దాల్చింది. ఇంతలో ఆమె అనారోగ్యం బారిన పడడంతో పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో ఆమెకు కేన్సర్ చివరి దశలో ఉన్నట్లు తేలింది. ఆమె తక్షణం కెమోథెరపీ చేయించుకుంటే కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కీమోథెరపీ చేయించుకుంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలకు ముప్పుందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె కఠినమైన నిర్ణయం తీసుకుంది. కేన్సర్ తనను కబళించినా పర్లేదు కానీ, బిడ్డ మాత్రం ఆరోగ్యంగా పుట్టాల్సిందేనని తేల్చింది. దీంతో ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. మూడునెలలు నిండాయి. సరిగ్గా బాబుకు 100 రోజులు నిండేసరికి, ఆ తల్లికి నూరేళ్లు నిండిపోయాయి!

  • Loading...

More Telugu News