: ఆపరేషన్ కోసం పేషెంట్ కి మత్తిచ్చి... డాక్టర్ నిద్రపోయాడు!


సినిమాల్లో కామెడీ కోసం పెట్టిన సన్నివేశం నిజంగా జరిగింది. ఆపరేషన్ చేయడానికి రోగికి మత్తుమందు ఇచ్చిన ఓ డాక్టర్ ఆ తర్వాత ఆ విషయం మరచిపోయి తను తాపీగా వెళ్లి నిద్ర పోయాడు. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. మండి జిల్లాలోని ఓ ఆసుపత్రికి ఓ మహిళ ఆపరేషన్ నిమిత్తం వచ్చింది. ఆమెకు పరీక్షలన్నీ నిర్వహించిన వైద్యుడు ఎనస్తీషియా ఇచ్చాడు. దీంతో రోగి మత్తులోకి జారుకుంది. అంతకు ముందే మద్యం సేవించిన వైద్యుడు కూడా మత్తులోకి జారిపోయాడు. దీంతో ఓ విధంగా పెను ప్రమాదం జరగకుండా ఆగింది. అయినప్పటికీ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను అతనిని సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించినట్లు హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కౌల్ సింగ్ ఠాకూర్ అసెంబ్లీకి తెలిపారు.

  • Loading...

More Telugu News