: కోతకొచ్చిన లంబసింగి ఆపిల్... ఆంధ్రా కాశ్మీర్లో ఆపిల్ సాగు భేష్!


లంబసింగి ఆపిల్ కోతకొస్తోంది. ఆంధ్రా కాశ్మీర్ లంబసింగిలో ఆపిల్ పండ్ల సాగు ఫలితాలనిచ్చింది. అక్కడ మండు వేసవిలో కూడా వణికించే చలి ఉంటుంది. ఈ నేపథ్యంలో లంబసింగిలో ఓ గిరిజన యువకుడు ఇంటి ముందు ఆపిల్ చెట్టును పెంచాడు. అది ఏపుగా పెరిగి గుత్తులు గుత్తులు కాపు కాసింది. ఇవి కాశ్మీరీ ఆపిల్ ను పోలి ఉన్నాయని ఆనోటా ఈ నోటా వ్యవసాయ శాఖ అధికారులకు చేరింది. దీంతో వారు వచ్చి ఆ ఆపిల్ చెట్టు, పండ్లను పరిశీలించారు. దానిపై ఆరు రకాల పరిశోధనలు చేశారు. ఆరు రకాల అంట్లు కట్టారు. ఆరు రకాల ఆపిల్ పండ్ల దిగుబడి విధానాన్ని పరిశీలించారు. అక్కడ ఆపిల్ పండిస్తే తలెత్తే చీడపీడలపై పరిశోధనలు చేశారు. వారి అనుమానాలు నివృత్తి కావడానికి తోడు, రెండు దఫాలుగా దిగుబడి రావడంతో పరిశోధకుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దీంతో చింతపల్లి చుట్టుపక్కల మండలాల్లో ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉన్న కొన్ని ఎకరాల్లో సాగుబడి చేపట్టారు. అక్కడ మొక్కలు నాటితే కేవలం ఎనిమిది నెలల్లోనే ఆరు అడుగులకు పైగా ఏపుగా ఎదిగి పూతకు సిద్ధమయ్యాయి. దీంతో శాస్త్రవేత్తలు వాటి పూతను తొలగించారు. కేవలం రెండు చెట్లకు మాత్రమే పూతను ఉంచారు. ఇవి బాగుండడంతో మరిన్ని ప్రాంతాల్లో చెట్లను నాటేందుకు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News