: ఆ కల్నల్ నా భార్యను ఎత్తుకుపోయాడు: ఆర్మీ మేజర్ ఆరోపణ


ఇటీవలి కాలంలో ఆర్మీ అధికారుల వ్యవహారశైలిపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్మీలోని కల్నల్ ర్యాంకు అధికారిపై మేజర్ ర్యాంకు అధికారి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్ లోని దానాపూర్ మిలటరీ క్యాంపులో వైద్యుడిగా సేవలందిస్తున్న మేజర్ బినోద్ కుమార్ తన భార్యతో కలిసి ఆర్మీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. అతని భార్య ఆర్మీకి చెందిన ప్రీ ప్రైమరీ స్కూల్ లో ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెతో కల్నల్ రవిచందర్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని, ఆయన తన భార్యకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిపోయారని బినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్నల్ రవిచందర్ మావోయిస్టు నిరోధక దళమైన కోబ్రా ఫోర్స్ కు ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. తాజా ఆరోపణలతో ఆయనను జార్ఖాండ్, బీహార్ సబ్ ఏరియా స్టేషన్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 497, 506, 379, 34, 504 కింద కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News