: ఆర్థిక వ్యవస్థ పటిష్టమవ్వాలంటే దేశీయ విపణిపై ఆధారపడాలి: ఆర్బీఐ గవర్నర్


భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా తయారవ్వాలంటే దేశీయ విపణిపై ఆధారపడాలని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎగుమతుల కోసం ఉత్పత్తి చేయడంతో పాటు, భారత్ కోసం కూడా ఉత్పత్తి చేయాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఎగుమతుల ఆధారిత వృద్ధిరేటు విధానం మార్చుకోవాలని ఆయన సూచించారు. ఆర్బీఐ చేపడుతున్న సంస్కరణలు స్థిరమైన వృద్ధి రేటు సాధించేందుకు దోహదం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విదేశీ ప్రత్యక్ష పన్నులను ఆహ్వానించేందుకు పన్ను విధానాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. దేశీయ తయారీ రంగాన్ని పటిష్టం చేసేందుకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News