: ఇంటర్ పరీక్షలు వేర్వేరు... ఎంసెట్ మాత్రం కలిసే!: నరసింహన్
ఇంటర్మీడియట్ పరీక్షలు రెండు రాష్ట్రాలు వేర్వేరుగా నిర్వహించుకోవచ్చని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల ప్రయోజనాలు కాపాడుతామని అన్నారు. ఇంటర్ పరీక్షలు ఎలా నిర్వహించినా, ఎంసెట్ ఎంట్రన్స్ మాత్రం ఉమ్మడిగా నిర్వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఎలాంటి సమస్యలు లేవని ఆయన వెల్లడించారు. అధికారుల విభజనపై ప్రధానితో చర్చించినట్టు ఆయన చెప్పారు. అధికారుల విభజన తొందర్లోనే పూర్తవుతుందని ఆయన తెలిపారు.