: 20 వాహనాలను తగులబెట్టిన మావోయిస్టులు
జార్ఖండ్లో బాక్సైట్ గనులు అధికంగా ఉండే లోహర్ జిల్లాలో సుమారు 20 వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టారు. ఈ ఘటన కిస్కో పోలీసు స్టేషన్ పరిధిలో జరిగినట్టు తెలుస్తోంది. నిప్పంటించిన వాహనాల్లోని కొన్ని ట్రక్కుల్లో ఖనిజాలు నింపి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ పని చేసింది తామేనని ఇప్పటివరకూ ఏ మావోయిస్టు దళం కూడా ప్రకటించలేదు. కాగా, ఘటనపై దర్యాప్తును ప్రారంభించామని పోలీసులు తెలిపారు.