: ఇక రైల్వే స్టేషన్లలోనూ పిజ్జా హట్, కేఫ్ కాఫీ డే!


సుదూర ప్రయాణాలకు భారతీయ రైల్వేలు సురక్షితం. సుఖవంతం. అయితే రైల్వే స్టేషన్లలోని వసతులేమాత్రం మెరుగు కావడం లేదు. నాణ్యత లేని ఆహార పదార్థాలను కూడా అధిక ధరలకు కొనాల్సిందే. అయితే ఈ పరిస్థితికి ఈ నెలాఖరుతో చెక్ పెట్టనున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ సీటీసీ) చెబుతోంది. వచ్చే ఏడాది నుంచి రైల్వే స్టేషన్లలో పిజ్జా హట్, కేఫ్ కాఫీ డే, సబ్ వే, బరిస్టా కాఫీల శాఖలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రైల్వే స్టేషన్లలో తమ శాఖలను ఏర్పాటు చేయాలని ఆయా సంస్థలను కోరినట్లు ఐఆర్ సీటీసీ వెల్లడించింది. ప్రయాణికులకు నాణ్యత గల ఆహార పదార్థాలను అందించడమే ప్రధాన లక్ష్యమైనా, ఈ శాఖల ద్వారా ప్రస్తుతం వస్తున్న రూ.30 కోట్ల ఆదాయాన్ని రూ.50 కోట్లకు పెంచుకునేందుకు ఐఆర్ సీటీసీ పక్కాగా పథక రచన చేస్తోంది.

  • Loading...

More Telugu News