: ముగ్గురి 'బాంబే బ్లడ్' దానంతో గుండెజబ్బు చిన్నారికి చికిత్స


అత్యంత అరుదుగా లభించే బ్లడ్ గ్రూప్ లలో 'బాంబే బ్లడ్' ఒకటి. ఈ గ్రూప్ రక్తాన్ని ఇండియాలో 196 మంది మాత్రమే కలిగి ఉన్నారు. ఢిల్లీలోని ఏ ఒక్క బ్లడ్ బ్యాంకులో కూడా ఒక్క యూనిట్ 'బాంబే బ్లడ్' లభించే పరిస్థితి లేదు. అటువంటి స్థితిలో బాంబే బ్లడ్ గ్రూప్ తో పుట్టిన ఓ ఉత్తర ప్రదేశ్ చిన్నారి గుండెకు కీలకమైన శస్త్రచికిత్స నిర్వహించాల్సి వచ్చింది. రక్తదాతల కోసం ఎంతో వెతకగా, చివరికి సోషల్ మీడియాలో పెట్టిన మెసేజ్ ఫలితాన్ని ఇచ్చింది. పూణేకు చెందినా ప్రబోద్, చెంబూరు కు చెందినా అలెక్స్, మేహుల్ లు రక్తాన్ని ఇస్తామని ముందుకు వచ్చారు. వీరి నుంచి సేకరించిన రక్తంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చిన్నారికి చికిత్స చేస్తున్నారు. ఇండియాలోని ప్రతి 17,600 మందిలో ఒకరికి 'బాంబే బ్లడ్' ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. 'బాంబే బ్లడ్' కధాంశంగా గోపీచంద్ హీరోగా 'ఒక్కడున్నాడు' పేరిట ఓ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News