: ఆన్ లైన్లో సలహాలు కోరుతున్న క్రీడా మంత్రిత్వ శాఖ
క్రీడా మంత్రిత్వ శాఖ యువత నుంచి సలహాలు కోరుతోంది. ప్రపంచ క్రీడారంగంలో భారత్ సూపర్ పవర్ గా ఎదగాలంటే ఏం చేయాలో చెప్పండంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. MyGov వెబ్ సైట్ ద్వారా యువతీయువకులు తమ అభిప్రాయాలు పంచుకోవాలని క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ క్రీడారంగంలో భారత్ స్థిరమైన అభివృద్ధి కనబరుస్తోందని, అయితే, మరింతగా ఎదిగే సామర్థ్యం భారత క్రీడారంగానికి ఉందని అభిప్రాయపడింది. దేశంలో క్రీడా సంస్కృతి పురోగతి, క్రీడలు, విద్య మధ్య సమన్వయం, ప్రతిభను త్వరగా గుర్తించడం తదితర అంశాల్లో సరైన చర్యలు తీసుకుంటే భారత్ ప్రపంచ క్రీడారంగంలో సూపర్ పవర్ గా అవతరిస్తుందని క్రీడా మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.