: సోషల్ మీడియాతో జాగ్రత్త: జవాన్లకు సైన్యం హెచ్చరిక
సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని భారత సైన్యం తన సైనికులతో పాటు మాజీ సైనికులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇతరుల నుంచి మెయిల్ తీసుకోవడంతో పాటు వాటికి స్పందించడంలోనూ జాగరూకతతో మసులుకోవాలని సూచిందింది. సైన్యం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న శక్తుల నుంచి తమ సిబ్బందిని దూరంగా ఉంచేందుకే ఈ తరహా ఆదేశాలను జారీ చేశామని సైన్యం వెల్లడించింది. సోషల్ నెట్ వర్క్ లలో అవాస్తవాల ప్రచారం సాగుతుందన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు హెచ్చరించినట్లు తెలిపింది.