: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజీపడం: ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాజీపడబోమని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పదిహేనేళ్ల హోదా తెచ్చుకునేందుకు తాము ఏ అవకాశం వదిలిపెట్టకుండా తీవ్ర కృషి చేస్తామని ఢిల్లీలో మీడియాతో చెప్పారు. అంతేగాక విభజన చట్టంలోని హామీలను వెంటనే నెరవేర్చాలని కేంద్రానికి విన్నవించినట్టు తెలిపారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యానే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతిస్తున్నామని తెలిపారు. కాగా, బలవంత మతమార్పిడులకు తాము వ్యతిరేకమన్న ఎంపీ, దానిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.