: హైదరాబాద్ జవహర్ నగర్ లో పేలుడు... ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు
హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి క్రితం పేలుడు సంభవించింది. యూసుఫ్ గూడ పరిధిలోని జవహర్ నగర్ లో చోటుచేసుకున్న ఈ పేలుడులో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా, ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన పిల్లలను అధికారులు హుటాహుటీన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుకు దారి తీసిన కారణాలను వెలికితీసేందుకు రంగంలోకి దిగారు. పేలుడు జరిగిన ప్రాంతంలో క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తోంది. పేలుడు సమాచారం తెలిసిన వెంటనే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపానాథ్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయి వైద్య చికిత్సలు అందిస్తామని ఆయన ప్రకటించారు.