: మా చందాలపై నోరెత్తితే కోర్టుకీడుస్తాం: బీజేపీకి కేజ్రీవాల్ హెచ్చరిక


మిన్నటి ఢిల్లీ ఎన్నికల ఖర్చుల కోసం తాము స్వీకరించిన విరాళాలపై మరోమారు నోరెత్తితే కోర్టుకీడుస్తానంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్. ఈ హెచ్చరిక ఎవరికో తెలుస్తా? కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ నేతలకట. పొద్దస్తమానం నాటి విరాళాల గురించి మాట్లాడి తమ సహనాన్ని పరీక్షించవద్దని ఆయన బీజేపీ నేతలకు కాస్త ఘాటుగానే సమాధానమిస్తున్నారు. అయినా నాటి తమ విరాళాల సేకరణలో ఎలాంటి పొరపాట్లు లేవని సాక్షాత్తు ఢిల్లీ హైకోర్టే చెబితే, ఇప్పుడు దానిపై ఎలా మాట్లాడతారంటూ ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అయినా ముందు మీ పార్టీకి నిధులెలా సమకూరుతున్నాయో చెప్పడంటూ ఆయన బీజేపీకే సవాల్ విసిరారు. మరి ఆయన సవాల్ ను బీజేపీ స్వీకరిస్తుందో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News