: 'ఫోర్బ్స్' భారత అత్యంత సంపన్న స్పోర్ట్స్ స్టార్ గా ధోనీ
భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (ఏడాదికి రూ.141.80 కోట్లు) 'ఫోర్బ్స్' భారత అత్యంత సంపన్న స్పోర్ట్స్ స్టార్ గా నిలిచాడు. భారత సంపన్న సెలబ్రిటీల ఓవరాల్ జాబితాలో ధోనీ నాలుగోస్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు అగ్రస్థానం దక్కింది. సల్మాన్ (రూ.244 కోట్లు) తర్వాత స్థానాల్లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఈ టాప్-10 జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. కోహ్లీకి 6వ స్థానం, సచిన్ కు 10వ స్థానం లభించాయి. అంతకుముందు, అక్టోబరులో 'ఫోర్బ్స్' విడుదల చేసిన వరల్డ్ రిచెస్ట్ స్పోర్ట్ పర్సన్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక భారత క్రీడాకారుడు ధోనీయే. ఆ జాబితాలో జార్ఖండ్ డైనమైట్ కు 22వ ర్యాంకు దక్కింది.