: ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ప్రారంభమైంది: పొన్నాల
టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి చొప్పున కేటాయిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్... భూములు కొనేందుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. భూముల కొనుగోలుకు రూ. 7 లక్షల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఆరు నెలల కింద అర్హులైన పింఛనుదారులు ఇంతలోనే అనర్హులవుతారా? అని నిలదీశారు. కేసీఆర్ పరిపాలనలో పింఛనుదారులు, వికలాంగులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని... వీటన్నింటికీ టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ వ్వతిరేకత ఆరంభమైందని చెప్పారు.