: కడప సెంట్రల్ జైలు వద్ద ఖైదీ పరారీ


జార్ఖండ్ లోని చైబాసా కేంద్ర కారాగారం వద్ద మూడు రోజుల క్రితం ఖైదీలు తప్పించుకున్న తరహాలో నేడు కడప సెంట్రల్ జైలు వద్ద మరో ఘటన జరిగింది. జైలులోకి వెళుతున్న క్రమంలో ఓ ఖైదీ పరారయ్యాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ అనే ఖైదీ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. అనంతపురం జిల్లా నుంచి అతడిని పోలీసులు కడప కేంద్ర కారాగారానికి తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తప్పించుకున్న ఖైదీ సునీల్ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News