: నేడు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. నేటి ఉదయం పశ్చిమగోదావరి జిల్లా వెళ్లనున్న చంద్రబాబు జిల్లాలోని కైకరంలో జరగనున్న రైతు సాధికారత సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా రుణమాఫీలో భాగంగా రైతులకు రుణమాఫీ పత్రాలను అందించనున్నారు. అనంతరం సాయంత్రం కృష్ణా జిల్లాలోని విజయవాడకు వెళ్లనున్న చంద్రబాబు అక్కడ ఏపీ ఫైర్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇకపై ఏపీ ఫైర్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు విజయవాడ నుంచే కొనసాగనున్నాయి.