: కేరళ ఆర్థిక మంత్రిపై లంచం కేసు నమోదు
కేరళ ఆర్థికమంత్రి కేఎం మణిపై విజిలెన్స్, ఏసీబీ లంచం కేసు నమోదు చేసింది. గతేడాది కేరళలో మూతపడిన 418 బార్లను తెరిపించడానికి ఆయన కోటి రూపాయల లంచం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో రుజువైందని ఎఫ్ఐఆర్ లో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. మూతపడిన బార్ల లైసెన్సులు పునరుద్ధరించేందుకు ఆర్థికమంత్రి తనను 5 కోట్ల రూపాయల లంచం అడిగారని, దీంతో తాను బార్ యజమానుల నుంచి కోటి రూపాయలు ఇచ్చానని కేరళ హోటళ్లు, బార్ల సంఘం అధ్యక్షుడు బిజు రమేష్ తెలిపారు. గత నెలలో ఓ టీవీ షోలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. దీంతో అప్పట్లో అసెంబ్లీ అట్టుడికిపోయింది. ఆయన రాజీనామా చేయాలంటూ అసెంబ్లీలో ఆందోళన కూడా చేశారు. దీంతో ఏసీబీ, విజిలెన్స్ రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేసింది. ఆయనపై ఆరోపణలు రుజువవడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉమెన్ చాందీ ప్రభుత్వానికి ఇది ఊహించని పరిణామం.