: ఎర్రచందనం వేలంతో 855 కోట్ల ఆదాయం సమకూరింది!
ఎర్రచందనం వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 855.91 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టు అదనపు పీసీసీఎఫ్ పీకే ఝా తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 153 లాట్ల కొనుగోలుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించామని వెల్లడించారు. సీ గ్రేడ్ కు చెందిన 36 లాట్ల ఎర్రచందనం విక్రయాన్ని ప్రభుత్వం నిలిపేసిందని ఆయన వివరించారు. 117 లాట్ల ఎర్రచందనం విక్రయాలను ప్రభుత్వం ఖరారు చేసిందని ఆయన తెలిపారు.