: రాజధానిపై కేంద్రం అనుమతి తప్పనిసరి: మంత్రి నారాయణ
రాజధానిపై కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయమూ తేటతెల్లమేనని అన్నారు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకునే నిర్మాణం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో తొలి విడతగా 30 మంది ప్రభుత్వోద్యోగులను ఎంపిక చేసి నైపుణ్య శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. వీరిలో అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉంటారని ఆయన తెలిపారు.