: 22 రాష్ట్రాలు ఆ బిల్లును అంగీకరించాయి... కేంద్రం చర్చ జరగాలంటోంది!


పరువు హత్యలను నిరోధించేందుకు ప్రత్యేక బిల్లు కోసం లా కమిషన్ చేసిన సిఫారసులను 22 రాష్ట్రాలు ఆమోదించాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, 22 రాష్ట్రాలు అంగీకరించినప్పటికీ ఈ విషయంపై చర్చ జరగాలని కేంద్రం ఆశిస్తోందని అన్నారు. అయితే చర్చ జరిగేందుకు నిర్ణీత గడువును కేంద్రం నిర్దేశించలేదు. లా కమిషన్ సిఫారసులకు మద్దతు తెలుపుతూ ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లేఖలు పంపాయని ఆయన సభకు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపాక చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News