: ట్విట్టర్ ఖాతా తెరిచిన టీమిండియా ఓపెనర్
టీమిండియా డాషింగ్ ఓపెన్ శిఖర్ ధావన్ (SDhawan25) ట్విట్టర్ అకౌంట్ తెరిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు ఆడుతున్న ధావన్ డిసెంబర్ 2న ఈ మైక్రో బ్లాగింగ్ సైట్లో అడుగుపెట్టాడు. తొలి ట్వీట్ ద్వారా అభిమానులను పలకరించాడు. అందరికీ శుభాకాంక్షలు తెలిపాడీ ఢిల్లీ స్టార్. అందరితో కనెక్ట్ కావడం ఉద్విగ్నతకు గురిచేస్తోందని పేర్కొన్నాడు. కాగా, ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ధావన్ 2400 మందికి పైగా ఫాలోయర్లను సంపాదించుకున్నాడు.