: ప్రసంగపాఠంలో 'పేజీ' పారేసుకున్న సత్యార్థి... నోబెల్ వేదికపై నవ్వులు
పాకిస్తాన్ బాలిక మలాలాతో కలసి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న కైలాష్ సత్యార్థి వేదికపై నవ్వులు పూయించారు. తన ప్రసంగపాఠంలో ఒక పేజీని ఎక్కడో జారవిడిచి వేదికపైకి వచ్చిన ఆయన ఆ విషయాన్ని గమనించకుండానే మాట్లాడటం మొదలుపెట్టారు. "కేవలం సదస్సులు నిర్వహించడంతో సమస్యలకు పరిష్కారం లభించదు... మిత్రులారా, ఇప్పుడు ఏం కోల్పోయానంటే... నా ప్రసంగపాఠంలో ఒక పేజీని" అనడంతో ఓస్లో సిటీ హాల్ నవ్వుల్లో మునిగింది. "అయినప్పటికీ, ఏం పర్లేదు. అది లేకుండా కూడా నేను కొనసాగిస్తా" అంటూ తన ప్రసంగాన్ని ముందుకు నడిపారు. ఆ తరువాత ఓ అధికారి వచ్చి ఆ పేజీని ఇవ్వగా "చాలా కృతజ్ఞతలు. నోబెల్ చరిత్రలో ఇలాంటి ఘటన జరిగిందో.. లేదో నాకు తెలియదు!" అనడంతో మరోసారి వేదిక నవ్వుల వర్షంలో తడిసింది.