: ప్రతి 7 డ్రైవింగ్ లైసెన్స్ లలో ఒకటి నకిలీదే!
దేశంలో మొత్తం 6 కోట్ల డ్రైవింగ్ లైసెన్స్ లు ఉండగా, వాటిల్లో 74 లక్షలకు పైగా నకిలీవని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అంటే దాదాపు ప్రతి 7 డ్రైవింగ్ లైసెన్స్ లలో ఒకటి నకిలీదన్నట్టు. రాష్ట్రాల ఆర్టీఓ డేటాబేస్ లు అసంఘటితంగా ఉండటం, ఏజెంట్ ల తప్పుడు సమాచారం, కఠిన నిబంధనలు లేకపోవడం తదితరాలు నకిలీ లైసెన్స్ లు పెరిగిపోవడానికి కారణమని ఎన్ఐసీ తెలిపింది.