: సైబరాబాద్ పరిధిలో మూడు నెలలపాటు 144 సెక్షన్
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మూడు నెలల పాటు 144 సెక్షన్ విధిస్తూ కమిషనర్ సీ.వీ.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం అమలులోకి వచ్చే ఉత్తర్వులు, 2015 మార్చి 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఈ నిషేధాజ్ఞల్లో భాగంగా, సైబరాబాద్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు. ముందస్తు అనుమతిలేనిదే ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదు. కాగా, గతంలో విధించిన 144 సెక్షన్ గడువు నిన్నటితో ముగియడంతో, దాన్ని పొడిగిస్తూ సీ.వీ.ఆనంద్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.