: మాజీ ప్రేయసి కుందేలును కసామిసా నమిలేశాడీ టీవీ నటుడు!


అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో దిమిత్రి డయట్షెంకో (46) అనే టీవీ నటుడు తన మాజీ ప్రియురాలి పెంపుడు కుందేలును తినేశాడు. చంపి, తోలుతీసి భోంచేశాడు. అంతేగాకుండా, తన మాజీ గాళ్ ఫ్రెండ్ ను కూడా కుందేలు తరహాలోనే తోలు తీసి చంపేస్తానని బెదిరించాడు. ఇప్పుడతనిపై జంతు హింస, క్రిమినల్ బెదిరింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఇద్దరం కలిసి ఉండడం ఇక కుదరదని మాజీ గాళ్ ఫ్రెండ్ చెప్పిందన్న కారణంతోనే దిమిత్రి ఈ కిరాతక చర్యకు ఒడిగట్టాడు. తొలుత కుందేలును చంపాడు. అనంతరం దాని తోలు వలిచి, ముక్కలుగా కోసి వండాడు. ఆ ఫొటోలను ఒక్కొక్కటిగా మాజీ ప్రేయసికి పంపాడట. కాగా, నేరం నిరూపితమైతే దిమిత్రికి నాలుగేళ్లకు పైగా శిక్ష పడే అవకాశాలున్నాయి. ఈ నెలలో విచారణ జరగనుంది.

  • Loading...

More Telugu News